ప్ర‌తిభ‌కు ప‌ట్టం

ప్ర‌తిభ‌కు ప‌ట్టం

అమ‌రానంద‌కు నాలుగు బంగారు పతకాలు


ఎండపల్లి, ఆంధ్రప్రభ: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన టీచర్ సిరిపురం మల్లయ్య కూతురు సిరిపురం అమరానంద (Siripuram Amarananda) అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. శాతవాహన విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో తెలుగు విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఆమె నాలుగు బంగారు పతకాలు సాధించింది.

స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) స్వయంగా అమరానందకు బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు, ఉపాధ్యాయ వర్గం ఆమెను హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Leave a Reply