10days | ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలి

10days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు స్పష్టంగా వివరించాలని ఎన్డీయే నేతలకు సూచించారు.
ఇవాళ అమరావతిలో ఎన్డీయే కూటమి నేతలు, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కూడా పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని పీవీఎన్ మాధవ్ కోరగా, సీఎం చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించారు.
రాబోయే 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ సమావేశాల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరుపుదామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే వ్యతిరేకిస్తోందని పేర్కొంటూ, 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బిల్లును చట్టంగా మార్చిందని చంద్రబాబు తెలిపారు.
