సీఎం రేవంత్ ని కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కర్ర రాజశేఖర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో… శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కర్ర రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. బ్యాంకు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాలను చైర్మన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగదారులు, ఖాతాదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మెరుగైన సేవలు అందించాలని సీఎం సూచించారు.
బ్యాంకు అభివృద్ధి దిశగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కర్ర రాజశేఖర్ తెలిపారు.
