త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం

త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
మంగళగిరి, ఆంధ్రప్రభ : ఎన్నో దశాబ్దాలుగా దివి సీమప్రజలు కోరుకుంటున్న బ్రిడ్జి నిర్మాణ కల నెరవేరబోతుంది. గతంలో నాబార్డ్ నిధులు మంజూరు అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణంలో ఎటువంటి పురోగతి లేదు. ఉప ముఖ్యమంత్రి అవనిగడ్డ నియోజకవర్గం(Avanigadda Constituency)లో తుఫాను పర్యటన సందర్భంగా మరోసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై డిప్యూటీ సీఎం కార్యాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో మంజూరు చేసిన రూ. 109 కోట్లకు అదనంగా మరో 51 కోట్ల ను కూడా నాబార్డ్ ద్వారా మంజూరు చేయించడానికి ఉప ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. త్వరలో నిధులతో పనులు ప్రారంభిస్తారు. ఎదురు మొండి బ్రిడ్జికి నిధులు మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు , ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ మండలి బుద్ధ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
