మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. బంగారతో పాటు వెండి రేటు కూడా తగ్గింది. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,540గా ఉంది. నిన్నటితో పోలిస్తే.. సుమారు రూ.800 మేర ధరలో కోత పడింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా భారీగా కోత పడింది. కిలో వెండి ధర రూ.3200 మేర తగ్గి రూ.1,50,900కు చేరుకుంది. రెండు వారాల్లో బంగారం ధరలు దాదాపు 7 శాతం తగ్గాయి. నవంబర్ 4న బంగారం ధర 10 గ్రాములకు రూ.1,200 తగ్గింది. వెండి కూడా రూ.2,500 తగ్గింది. అక్టోబర్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 17న ధర 10 గ్రాములకు రూ.1.33 లక్షలకు చేరుకుంది. అయితే.. అప్పటి నుండి ధర నిరంతరం తగ్గుతూనే ఉంది. గత రెండు రోజుల్లో బంగారం ధరలు కూడా తగ్గాయి. గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. దీంతో, పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈ వారమంతా బంగారం ధరల్లో దిద్దుబాట్లు తప్పవనేది మార్కెట్ వర్గాల అంచనా.

