కొనుగోలు కేంద్రం ప్రారంభం
వ్యవసాయానికి పెద్ద పీట
ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్
కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గూడూరు గ్రామంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ (Kagita Krishna Prasad) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, రైతులు తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని సూచించారు. రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు (farmers) చూసుకోవాలని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ధాన్యం మిల్లుకు వెళ్లిన 48 గంటల్లో రైతుల అకౌంట్‌లో డబ్బులు జమవుతాయని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల డీసీ చైర్మన్ పోతన లక్ష్మి నరసింహాస్వామి నాయుడు, మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి గుమ్మడి శివ రామకృష్ణ జనసేన మండల అధ్యక్షుడు దాసరి సాయి రాం,బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

