స‌ముద్ర స్నానాలు ఆచ‌రించి..

స‌ముద్ర స్నానాలు ఆచ‌రించి..

మంగినపూడి బీచ్‌లో సాగర సుప్రభాత హారతి ఇచ్చిన మంత్రి రవీంద్ర
కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తజనులు

కృష్ణా జిల్లా, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉసిరి చెట్ల వద్ద దీపారాధనలు చేశారు.

కార్తీక పౌర్ణమి (Karthika Pournami) కి ప్రత్యేక ఉండటంతో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్ద, మచిలీపట్నం నియోజకవర్గం మంగినపూడి బీచ్ వద్ద భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి సాగరునికి ప్రత్యేక పూజలు చేశారు.

సముద్ర స్నానాలు ప్రారంభించిన మంత్రి రవీంద్ర..

కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ (Manginapudi Beach) వద్ద సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రమ-వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలసి పవిత్ర సముద్ర సాన్నం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేశామని, దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బీచ్ టూరిస్ట్ ప్లేస్ మంగినపూడి బీచ్ ను అభివృద్ధి చేస్తాని తెలిపారు.

Leave a Reply