బుగ్గుబావిగూడెంలో బస్సు ప్రమాదం..

బుగ్గుబావిగూడెంలో బస్సు ప్రమాదం..

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను ఢీకొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డు పై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

Leave a Reply