ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు!

- సౌతాఫ్రికాకు సాధ్యమేనా?
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత మహిళల జట్టు చరిత్రను తిరగరాసింది. సౌతాఫ్రికాపై అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా, సెంచరీ లేకుండానే 298/7 భారీ స్కోరును సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ స్కోరు, ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో భారత్ తరఫున (పురుషులు, మహిళలు కలిపి) నమోదైన అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ కావడం విశేషం. ఇది 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో పురుషుల జట్టు శ్రీలంకపై సాధించిన 277/4 రికార్డును, అలాగే 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై చేసిన 240 పరుగుల స్కోరును కూడా అధిగమించింది.
ఇక, పురుషుల విభాగంలో అత్యధిక విజయవంతమైన చేధన భారత్ (277/4) కాగా, మహిళల విభాగంలో అది ఇంగ్లాండ్ (167/6) పేరిట ఉంది.
భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యం ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఎప్పుడూ చేధించని స్కోరు కావడంతో, విజయం సాధించాలంటే సౌతాఫ్రికా మహిళల జట్టు చరిత్రను తిరగరాయాల్సిందే.
