- పలు కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…
ఆంధ్రప్రభ ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ కూడళ్ల వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ 30 మంది వాహనదారులు పట్టుబడినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. అలాగే పట్టణంలోని లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఇతర ప్రాంతాల నుండి వచ్చి లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాలు పరిశీలించారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


