భారత్ పునర్ నిర్మాణమే లక్ష్యం..

భారత్ పునర్ నిర్మాణమే లక్ష్యం..
చేవెళ్ల, (ఆంధ్రప్రభ): అఖండ భారత్ పునర్ నిర్మాణమే లక్ష్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పని చేశారని మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వెల్లడించారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ భారత జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. జాతి ఐక్యత కోసం తుది శ్వాస విడిచే వరకు కృషి చేశారన్నారు. పటేల్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాజాపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తేల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండన్న వెంకట్ రెడ్డి, యువ నాయకులు డాక్టర్ మల్ వైభవ్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, బాలయ్య, లింగారెడ్డి, అత్తిలి మధుసూదన్ రెడ్డి, చీర శ్రీనివాస్ యాదవ్, పెద్దోళ్ల కృష్ణ, పీసరి శ్రీకాంత్, పల్గుట్ట బాలయ్య, ఆలూరు కృష్ణ, మల్గారి మధుకర్ రెడ్డి, అల్లాడ అభిషేక్ రెడ్డి, పి. వెంకటేష్, చాకలి శ్రీనివాస్, జై సింహ రెడ్డి, పురషోతం రెడ్డి, దామోదర్ చారి తదితరులు పాల్గొన్నారు.
