దశలవారీగా పర్యవేక్షించాలి…

- శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి
ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం : పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తులో నైపుణ్యత,వేగం ప్రాధాన్యతగా బావించి ప్రతి కేసు దశలవారీగా పర్యవేక్షించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి,, ఆదేశించారు.గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులతో కేసుల పెండింగ్ నకు గల కారణాలు, ముద్దాయిలు అరెస్టు, నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు,కేసుల దర్యాప్తు, తదితర అంశాలపై నెల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… కేసుల దర్యాప్తులో భౌతిక ఆదారాలు సాధన కీలకమైన దశ అని, ప్రతి పోలీసు అధికారి వృత్తిపరమైన నిబద్ధతతో, నిష్పాక్షికతతో వ్యవహరించాలని తెలిపారు.దర్యాప్తులో నైపుణ్యత, తక్షణ స్పందన, సాక్ష్యాధారాల సేకరణలో ఖచ్చితత్వం ముఖ్యమని ఆయన తెలిపారు. సాక్ష్యాలను శాస్.. యంగా సేకరించి,చార్జ్షీట్లు సమయానికి దాఖలు చేయాలన్నారు.కోర్టులో సరైన ఆధారాలు తో దర్యాప్తు పత్రాలు సిద్ధం చేయాలన్నారు.
ప్రజల ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి వెంటనే విచారణ చేపట్టాలన్నారు.ప్రతి అధికారి తన పరిధిలో పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత కేసులు త్వరితగతిన విచారణనికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ కేసులలో సకాలంలో సమగ్రంగా దర్యాఫ్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని,దోషులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. రాత్రి వేళలో పకడ్బందీగా విధులు నిర్వర్తించి కొత్త,అనుమానిత వ్యక్తులు తారస పడితే వివరాలను ఆరా తీయాలని అని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ నేరాలు పై దృష్టి కేంద్రీకరించాలని, ప్రత్యేక బృందాలు గా ఏర్పడి కేసులు ఛేదించాలన్నారు.ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ప్రతి రోజు గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులతో మమేకమై శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు వివరాలను సేకరించి అలాంటి వారిపై నిఘా ఉంచాలని తెలిపారు.
పాత నేరస్థులు కదలికల పై దృష్టి కేంద్రీకరించి ఏటువంటి అల్లర్లు, గొడవలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు ముఖ్యమైన అంశాలపై జిల్లా ఎస్పీ దిశ నిర్దేశం చేశారు. ఈ నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ కెవి రమణ, పి శ్రీనివాసరావు,డీఎస్పీలు సి హెచ్ వివేకానంద, లక్ష్మణరావు పరిపాలన అధికారి సి,హెచ్ గోపీ నాథ్, సిఐ ఇమ్మానియల్ రాజు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు పాల్గొన్నారు.
