పునరావాస కేంద్రాల సందర్శన..

పునరావాస కేంద్రాల సందర్శన..

తెనాలి, ఆంధ్రప్రభ: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలి(Tenali)లో పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,451 మంది ప్రజలకు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించినట్టు అధికారులు తెలిపారు.

బాధితుల కుటుంబాలకు రేషన్ సరుకులతో పాటు గరిష్టంగా రూ.3,000 నగదు(maximum cash of Rs.3,000) సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్(A. Tamim) అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, పురపాలక సంఘం చైర్‌పర్సన్ రాధిక, కమీషనర్ జె. రామ అప్పల నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply