తెలంగాణ మత్స్యాకారుడిని కాపాడిన పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులు

తెలంగాణ మత్స్యాకారుడిని కాపాడిన పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులు

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పల్నాడు జిల్లా(Palnadu District) ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణరక్షణ మరియు సమాజ శ్రేయస్సును ప్రధాన ధ్యేయంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో బాగంగా నిన్నటి(28.10.2025) రోజున కృష్ణా నది(Krishna river)లో చేపలు పట్టుకోడానికి తెలంగాణ సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం, వెల్లటూరు గ్రామం, చింతలపాలెం, శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పరసగాని.శ్రీను మత్స్యకారుడు మిషన్ బోటు(mission boat) వేసుకొని తోటి జాలర్లతో కలసి కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లాడు.

రాత్రి చేపల వేట ముగించుకొని తిరుగు ప్రయాణం లో తన బోటు చెడిపోయింది. దగ్గరలోని ఒడ్డుకు చేరుకున్నారు. తుఫాను తీవ్రతతో ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. బుధవారం (29.10.2025) ఉదయం బెల్లంకొండ ఎస్సై డి. ప్రవీణ్ కుమార్(SI D. Praveen Kumar)కి అందిన సమాచారంతో జాలర్ల సహాయంతో పరసగాని.శ్రీనును సురక్షితంగా బంధువులకు అప్పగించారు.