బీ తోటూరులో దుర్ఘటన

బీ తోటూరులో దుర్ఘటన
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా), ఆంధ్రప్రభ : శ్రీకాకుళం(Srikakulam) జిల్లా ఇచ్చాపురం మండలంలోని బీ.తోటూరు(B. Thotur) గ్రామంలో బాహుదానదిలో 24 గొర్రెలు(24 sheep) మృతి చెందాయి. నదిలో నీటి ఉధృతికి ప్రమాదవశాత్తు ఈ గొర్రెలు మునిగినట్లు అధికార్లు చెబుతున్నారు.
ప్రమాద స్థలాన్నితహసీల్దార్ వెంకటరావు, సిఐ చిన్నమనాయుడు, రూరల్ ఎస్సై(Rural S.I) తదితరులు సందర్శించారు. గ్రామంలో ముందుగా దండోరా వేయించి అప్రమత్తం చేసినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు(officials) చెబుతున్నారు.
