భూప‌తిపై సీసీ చ‌ర్య‌

భూప‌తిపై సీసీ చ‌ర్య‌

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : సీనియర్ మావోయిస్టు నేత (Maoist Leader) మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి మావోయిస్టు ద్రోహి అని మావోయిస్టు కేంద్ర క‌మిటీ (సీసీ) ప్ర‌క‌టించింది. ఆయ‌న వ‌ద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేకపోతే వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది.

ఇటీవల ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) ప్రకటన విడుదల చేసిన సంగ‌తి విదిత‌మే. ఈ ప్రకటనను కేంద్ర కమిటీ తప్పుబట్టింది. పార్టీపై మల్లోజుల వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర కమిటీ ఆరోపించింది. కాల్పుల విరమణ (ceasefire), శాంతి చర్చలపై ఆయ‌న ఇచ్చిన‌ ప్రకటనను కేంద్ర క‌మిటీ ఖండించింది. లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది. భూపతి.. సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషనీకి తమ్ముడు.

Leave a Reply