అభినందించిన‌ సీఎం చంద్ర‌బాబు..

చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లె గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసిన వినూత్న ప్రాజెక్ట్‌కు గాను ఈ గ్రామం ప్రతిష్టాత్మకమైన స్కోచ్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. కేవలం 45 రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించడంలో ఇది ఒక గొప్ప విజయంగా నిలిచింది.

ఈ అవార్డును చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, SPDC ఎస్.ఈ సురేంద్ర నాయుడు ఢిల్లీలో స్వీకరించారు. నారావారి పల్లె గ్రామం ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వినియోగించే గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ విజయం భవిష్యత్తులో ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నారు.

ఈ అవార్డు అందుకున్న గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించడంలో సహకరించిన ప్రజలు, అధికారులను కూడా ఆయన అభినందించారు.

ప్రాజెక్ట్ వివరాలు…

ఈ ప్రాజెక్ట్ కింద గ్రామంలోని మొత్తం 1,600 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం సామర్థ్యం 3,396 కిలోవాట్లు. ఏడాదికి 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీని విలువ రూ.3.39 కోట్లు.

Leave a Reply