పర్యావరణ ధ్వంసం తగదు..

  • ఎస్ఆర్ఎం వర్సిటీ ఇన్ చార్జి వైస్ చాన్సలర్
  • ఆకట్టుకున్న శాస్త్రీయ పరిశోధనా ప్రదర్శనలు.

ఆంధ్రప్రభ, మంగళగిరి రూరల్ : భావి తరాలకు సుస్థిర, ఆరోగ్యకర వాతావారణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచి వర్యావరణ హిత ఆవిష్కరణల కోసం శ్రమించాలన్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీయడం శ్రేయస్కరం కాదని అమరావతిలోని ఎస్ ఆర్ ఎం ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు.

ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం పర్యావరణ పరిశోధనల ఎగ్జిబిషన్ జరిగింది. ఏపీ, పంజాబ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 నుంది ఆండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులతో హాజరయ్యారు.

అబ్దుల్ కలామ్ ఆడిటోరియంలో యూనివర్సిటీ ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సిక్కిం, భూటాన్ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ నూరు శాతం అమలవుతోందనీ, ఈ దిశగా ఏపీ రాష్ట్రం కూడా ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీవీ టామి మాట్లాడుతూ, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నా, పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకబాటు భావన కలుగుతోందన్నారు.

ఇందుకోసం. విద్యార్థులు నూతన ఆలోచనలను అనుల్లో పెట్టి భవిష్యత్ తరాలకు ముంచి వాతావరణాన్ని అందించాలన్నారు. నృ జనాత్మక ఆలోచనలను పరస్పరం మార్చుకునేందుకు ఈ తరహ ప్రదర్శనలు దోహదపడతాయని కార్యకము కో ఆర్జివేటర్ డాక్టర్ రంగ భాస్యం సెల్వనెంబి అన్నారు.