తమిళ తంబీలుగా గుర్తింపు

తమిళ తంబీలుగా గుర్తింపు

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా కరకంబాడి(Karakambadi) రోడ్డులోని మంగళం అటవీ ప్రాంతంలో ఇద్దరు ఎర్ర చందనం(red sandalwood) స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

మామండూరు నుంచి కరకంబాడీ ఆటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్(Task Force) కూంబింగ్ చేపట్టగా గురువారం తెల్లవారు జామున మంగళం సమీపంలోని గ్రాండ్ వరల్డ్(Grand World) వెనుక కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోసాగారు. వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు(Police) ఇద్దరిని పట్టుకోగలిగారు.

వీరినుంచి 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం(seizure) చేసుకున్నారు. నిందితులిద్దరు తమిళతంబీలుగా గుర్తించారు. వీరిని తిరుపతి(Tirupati) టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించగా డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి(వీ. శ్రీనివాస రెడ్డి,), ఏసీఎఫ్ జే. శ్రీనివాస్ విచారించారు. ఎస్ఐ సీహెచ్ రఫీ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply