ఆ నిర్ణ‌యం ఎమోష‌న‌ల్‌గా తీసుకున్నారు…

ఆ నిర్ణ‌యం ఎమోష‌న‌ల్‌గా తీసుకున్నారు…

  • ఎమోష‌న‌ల్‌గా తీసుకున్ననిర్ణ‌యం కాబ‌ట్టి

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్సీ క‌విత‌ శాసనమండలి(Legislative Council) సభ్యత్వం రద్దు నిర్ణయం పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Sukhender Reddy) చెప్పారు. ఈ రోజు నల్లగొండ పట్టణంలో ని తన నివాస గృహంలో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమాన్నినిర్వహించారు.

ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమోషనల్ గా ఉన్నపరిస్థితుల్లో కవిత తన శాసనమండలి(Legislative Council) సభ్యత్వాన్నిరద్దు చేయాలని తనకు లేఖ పంపించార‌ని చెప్పారు. మానసికంగా ఒత్తిడి ఉన్నకారణంగా పంపించిన రాజీనామా లేఖ పై పునరాలోచించుకోవాలని తాను సూచించినట్లు చెప్పారు.

ప్రైవేటు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఒత్తిళ్ల నుండి ప్రభుత్వం బయట పడాలంటే ప్రభుత్వ విద్యా సంస్థల(Educational Institutions)ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సుఖేంద‌ర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) నిధులను ప్రైవేటు వైద్యశాలలకు చెల్లిస్తున్నామని ఇలా కాకుండా ప్రభుత్వ వైద్యశాలలను మరింత బలోపేతం చేస్తే పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల(Private Hospitals)కు రూ. 1300 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఇంత డబ్బు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు వెచ్చిస్తే పేదలకు అధునాతన వైద్య సౌకర్యాలు అందడంతో పాటు విలువైన ప్రజాధనం(Public Fund) ఆదా అవుతుందని చెప్పారు.

Leave a Reply