సభలో ప్రశ్నోత్తరాలు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వర్షాకాల అసెంబ్లీ(Assembly) సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సభలో మొత్తం 8 సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో పంచాయతీరాజ్ సవరణ(Panchayat Raj Amendment), మున్సిపల్ చట్టాల సవరణ(Amendment of municipal laws), ఏపీ మోటారు వాహనాల పన్నులు(AP Motor Vehicle Taxes), ఎస్సీ వర్గీకరణ(Classification of SC) సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
