Sensex | 500పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్..

Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభాలను నమోదు చేశాయి.

ఉదయం ప్రారంభ‌ సమయానికి నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 24,201 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే అమెరికా డాలర్ సూచీ 100.78 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 4.6 శాతానికి చేరాయి.

గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.38 శాతం, నాస్‌డాక్ 0.9 శాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లలో నమోదైన లాభాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, డాలర్ సూచీతో పాటు విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు బుధవారం దేశీయ సూచీల దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది.