అనంతపురంలో విగ్రహం ఆవిష్కరణ..

(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : అనంతపురం (Anantapur) జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దివంగత సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ (Statue unveiling) చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా, ఎమ్మెల్సీ ఎస్ మంగమ్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణన్ శర్మ, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జడ్పీ సీఈవో శివశంకర్, డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మహిళలకు కచ్చితంగా విద్య అవసరమని ప్రచారం చేయడంలో సావిత్రిబాయి పూలే (SavitribaiPhule) మొదటి మహిళ సంఘసంస్కర్త అని గుర్తు చేశారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
