వ్యక్తి ఆత్మహత్య…
చర్ల, ఆంధ్రప్రభ : భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపం చెంది, మద్యానికి బానిసై ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన చర్ల (Charla) లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చర్ల ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో నివాసముండే కీసరి పెద్ద సాయి (Keesari Pedda Sai) (30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గత రెండు నెలల క్రితం భార్యాభర్తల ( husband and wife) మధ్య గొడవలు జరగడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుండి మద్యానికి బానిసై ఖాళీగా తిరిగేవాడని, నిన్నటి నుంచి కనిపించలేదు. ఈ రోజు ఉదయం వాణి విద్యానికేతన్ పాఠశాల (Vani Vidyaniketan School) వెనుకవైపు ఉన్న పొలాల్లో గల బావిలో మృతదేహం గమనించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. మృతిచెందిన వ్యక్తికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
