సింగనమలలో సంచలనం

సింగనమలలో సంచలనం

  • పోలీసులు పట్టుకున్న వ్యక్తి మృతి
  • పోలీసులు కొట్టారని బంధువుల ఆరోపణ
  • గుండెపోటుతో మృతి చెందాలని పోలీసుల వివరణ
  • పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యుల ధర్నా

సింగనమల, ఆంధ్రప్రభ : పేకాటను అడ్డుకునే పయ్నంలో… పోలీసుల(Police) కఠిన వ్యవహార శైలితో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పోలీసుల మెడకే చుట్టుకుంది. కడకు పోలీసు స్టేషన్(Custody) ఎదుట ధర్నా.. ఉద్రిక్త పరిస్థితికి ఈ ఘటన దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆ వ్యక్తి మృతి(Death) చెందటంతో పోలీసులు కొట్టడం వల్ల మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులకు చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు ధర్నానిర్వహించారు.

వివరాల్లోకి వెళితే అనంతపురం(Anantapur) జిల్లా సింగనమల మండల పరిధిలోని నాగుల గుడ్డం తండాలో పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో రామ కృష్ణ నాయక్ ఒకరు. అదుపులోకి తీసుకున్నవ్యక్తుల నుంచి నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వచ్చి వాటిని తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు కొట్టడం వల్ల తీవ్ర ఆందోళనతో రామకృష్ణ గుండెపోటుకు గురై మరణించినట్లు బాధితుల తరఫున బంధువులు ఆరోపిస్తున్నారు.

అనంతపురం ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లగా ముందుగానే మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శవాన్నితీసుకువెళ్లి సింగనమల పోలీస్ స్టేషన్(Police Station) వద్ద పెట్టి ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు వెళ్లి పెద్ద ఎత్తున వారికి మద్దతు పలికారు.

Leave a Reply