టాలీవుడ్‌లో శివాని మ్యాజిక్
టాలీవుడ్‌లో శివాని మ్యాజిక్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు సినిమా రంగంలో కొత్త తారల మెరుపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, ఈ కోవలోకి ప్రవేశించిన యువ నటి శివాని నగరం.. యువత హృదయాలను గెలుచుకుంటోంది. ముఖ్యంగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్(little hearts) సినిమా సాధించిన ఘన విజయంతో శివాని పేరు టాలీవుడ్‌లో మారుమోగుతోంది.
సహజమైన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో శివాని చాలా తక్కువ సమయంలోనే అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో(social media) శివాని చురుగ్గా ఉంటూ.. నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు లెక్కలేనన్ని లైకులు, కామెంట్లు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ అయినా, కొత్త ఫ్యాషన్ షూట్స్(new fashion shoots) అయినా శివాని తన ఫ్యాషన్ సెన్స్‌ని ప్రదర్శిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. సంప్రదాయ వస్త్రాల నుంచి మోడర్న్, స్టైలిష్ లుక్స్ వరకు ఆమె తన వైవిధ్యాన్ని చూపుతోంది. దీంతో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ఫోటోలు విపరీతంగా లైకులు, కామెంట్లు సొంతం చేసుకుంటున్నాయి.
నటనతో పాటు..
కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, శివాని సంగీతంపై కూడా ఆసక్తి చూపుతోంది. ఆమెకు మంచి గాత్రం ఉంది. ప్రస్తుతం సంగీత పాఠాలు నేర్చుకుంటూ గాయనిగా కూడా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె బహుముఖ (versatile) ప్రతిభ భవిష్యత్తులో ఆమెకు మరింత మంచి అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
రెండు సినిమాలతోనే విశేషమైన గుర్తింపు..
శివాని సినీ ప్రయాణం 2024లో వచ్చిన అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ తో మొదలైంది. ఈ సినిమాలో సుహాస్‌తో కలిసి నటించిన ఆమె తన సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లో ఒక ఆశాజనకమైన కొత్త నటిగా పరిచయమైంది.
ఆ తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా భారీ విజయాన్నిసాధించింది. ఈ రెండు సినిమాల విజయాలు శివానిని టాలీవుడ్ యువతారల్లో ఒకరిగా నిలబెట్టాయి.
ఇదిలా ఉంటే, సుహాస్–శివాని జంట మరోసారి ‘హే భగవాన్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శివాని అందం, అభినయం, పాత్రలోకి ఒదిగిపోయే తీరు ఆమెకు యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. రాబోయే రోజుల్లో మరిన్నిమంచి చిత్రాలతో ఆమె ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.


























