అల్లాడుతున్న కన్నడ ప్రయాణికులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ః కర్నూలు(Kurnool) జిల్లా తుగ్గలి(Tuggali) మండల పరిధిలోని రాతన గ్రామంలో మంత్రాలయం బెంగళూరు రహదారి పై కర్ణాటక బస్సు(bus) రోడ్డులో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు తెల్లవారుజామున రెండు గంటల నుండి ఇప్పటిదాకా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఏ అధికారి ఈ విషయంపై పట్టించుకోవడం లేదు. రోడ్లు దెబ్బతిన్నాయని పలుసార్లు దినపత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వేలాదిమంది బెంగళూరు(Bangalore) నుంచి మంత్రాలయం కు ప్రతిరోజు వెళుతున్నారు.

అంతేకాక చెన్నై నుంచి బొంబాయి కూడా ఈ మార్గం గుండే రోజు వందల వాహనాలు వెళుతున్నాయి. ఇలాంటి రహదారి పై రాతన రోడ్డులో గుంతలు పడ్డాయని ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన, వివిధ దినపత్రికలలో వార్తలు వచ్చిన, ఏ అధికారి వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోని అక్కడున్న రోడ్డుకి మరుమతులు చేపట్టి ఇరుక్కున్న బస్సు(bus)లో ఉండే ప్రయాణికులకు తమ గమ స్థానానికి చేర్చే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply