గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : గాజా(Gaza )పై ఇజ్రాయెల్ దాడులు (Israel Attack) కొన‌సాగుతున్నాయి. గాజాను స్వాధీనం చేసుకోవడ‌మే ల‌క్ష్యంగా సోమవారం గాజా ఆస్పత్రి (Hospital)పై భారీ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు (Journalists) సహా 15 మంది మరణించారు. ఈ మేరకు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపింది. మరణించిన జర్నలిస్టుల్లో ఒకరు అల్ జజీరా(Jazeera)కు చెందినవారు కాగా.. మరొకరు రాయిటర్స్‌కు చెందినవారని పేర్కొంది. నాసర్ ఆస్పత్రి(Nasser Hospital)లోని నాల్గవ అంతస్తుపై దాడి జరిగిందని.. రెస్క్యూ సిబ్బంది పైకి వెళ్లేలోపే రెండో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఇక తాజా దాడిలో ఆస్పత్రి భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత వారం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం తొలి అడుగులు వేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఓ వైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు వైమానిక దాడులతో గాజా దద్దరిల్లుతోంది.