మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో…

తిరుపతి (ఆంధ్రప్రభ బ్యూరో-రాయలసీమ) : ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామి నివాసంలో సిట్ శుక్రవారం సోదాలు నిర్వహించింది.

తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన ఇంట్లో అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు సిట్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వం కాలంలో నారాయణస్వామి రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కొత్త మద్యం పాలసీ అమలు, దానిపై జరిగిన సంతకాలు, అలాగే లిక్కర్ ఆర్డర్స్ విధానంలో చేసిన మార్పులపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

వైకాపా హయాంలో మద్యం పాలసీలోఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, మాన్యువల్ ఆర్డర్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై కూడా సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply