ADB | మైనర్ బాలికను పెళ్లి పేరుతో కిడ్నాప్ చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్

జన్నారం, జూన్ 16 (ఆంధ్రప్రభ) : అభం, శుభం ఎరుగని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకొని కిడ్నాప్ చేసి, రేప్ చేసిన ఓ కీచకుడు జైలు పాలై, ఊచలు లెక్కబెడుతున్న ఉదంతమిది. మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ (Kidnapping) చేసి, రేప్ చేసిన 21ఏళ్ల మోతే అర్జున్ ను అరెస్ట్ చేసి లక్షేటిపేట కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సోమవారం తెలిపారు. ఓ మహిళ తన పెద్ద కుమార్తె కనబడడం లేదని ఈనెల 1వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసి విచారణ చేశామని ఆమె చెప్పారు.

విచారణ అనంతరం మందపల్లి వాసి అర్జున్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని హైదరాబాద్ (Hyderabad) కు తీసుకెళ్లి కిడ్నాప్ చేసి, రేప్ చేశాడని ఆమె చెప్పారు. అనంతరం అర్జున్ పై కిడ్నాప్, రేప్, పోక్సో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుని లక్షేట్టిపేట కోర్టులో హాజరుపచ్చమన్నారు. జడ్జి నిందితునికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (Judicial remand) విధించగా, అక్కడే ఉన్న జైలుకు తరలించామని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… మైనర్ బాలికల పట్ల చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. వారి పట్ల అనుచితంగా వ్యవహరించినా, ప్రేమ పేరుతో వేధించినా బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచి, నిందితులను కఠినంగా శిక్షించనున్నట్లు చెప్పారు.

Leave a Reply