స్వాతంత్ర్య స్ఫూర్తితో గాంధీకి నివాళి..
నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ దేశభక్తిని చాటుకున్నారు. గాంధీ చౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సాధన కోసం గాంధీజీ సాగించిన అహింసా పోరాటాన్ని స్మరించుకున్నారు. మహాత్ముడి సత్యం, అహింస, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు. వారి త్యాగాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశభక్తి జాతీయ పర్వదినాలకే పరిమితం కాకుండా ప్రజాసేవలో కనిపించాలని అన్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే మహాత్ముడికి నిజమైన నివాళి అని గోళ్ల రాజేష్ పేర్కొన్నారు.
