జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం (ఆంధ్రప్రభ): కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసు మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని కొనియాడారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కృష్ణా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.