ఘంటసాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘంటసాల (ఆంధ్రప్రభ): ఘంటసాల తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి. విజయప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు తహసీల్దార్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్, వీఆర్వోలు, వీఆర్ఏలు, సర్వేయర్లు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
