సిరిసిల్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల (ఆంధ్రప్రభ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.