పీఆర్‌సీ ప్రకటించి, డీఏలు విడుదల చేయాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం రోజున చిట్యాల మండల శాఖ టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో చిట్యాల తహసిల్దార్ విజయకుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడు నాగయ్య మాట్లాడుతూ.. యు ఎస్.పి.సి నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 29 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తీవ్ర నిరసనలు తప్పవని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పిఆర్సి ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు పచ్చని విడుదల చేయాలని అలా చేయకపోతే ప్రభుత్వం మీద తీవ్ర పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు సతీష్ గడ గోజు, బడుగు అరుణ, సరళ, ఎం జానకి, రామలింగయ్య, చంద్రశేఖర్, సాదిక్, రామ్మోహన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.