యశోద ఆసుపత్రిలో అరుదైన వైద్యం విజయవంతం.

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : యశోద ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన వైద్య చికిత్సను విజయవంతం చేసి శభాష్ అనిపించుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. మింగడంలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానంలో విజయవంతంగా చికిత్స అందించారు. సమస్య ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వరూప (40) అనే మహిళ గత ఆరు నెలలుగా ఘన, ద్రవ ఆహారాలు మింగలేకుండా తిన్నది వెనక్కి వచ్చేయడం (రిగరిటేషన్) వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రధాన ఫిర్యాదులతో ఆమె యశోద ఆసుపత్రిలో చేరారు.

సమగ్ర రోగి పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన వైద్యులు డిస్ఫేజియాకు గల అసలు కారణాన్ని గుర్తించడానికి అనేక సమగ్ర పరీక్షలు జరిగాయని తెలిపారు. మొదట అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ పరీక్ష చేయగా, అందులో ‘అకలాసియా’ లక్షణాలు ఉన్నట్లు తేలింది. రెండవ దశ మరింత స్పష్టత కోసం ‘హై-రెజల్యూషన్ మానోమెట్రీ’ పరీక్ష నిర్వహించబడుతుంది. రోగికి ‘టైప్-II అకలాసియా’ ఖచ్చితంగా నిర్ధారణ అయింది. రోగ నిర్ధారణ అనంతరం వైద్యులు రోగికి ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అనే అత్యాధునిక శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

అన్ని రకాల అనస్థీషియా పూర్వ వైద్య పరీక్షలు నిర్వహించి, రోగి బంధువుల అంగీకారం తీసుకున్న తర్వాత జూలై 20, 2026 న ఈ ప్రక్రియ జరిగింది. వైద్యుల నిపుణుల బృందం ఎలాంటి ఆపరేషన్ సమస్యలు (కాంప్లికేషన్స్) అత్యంత తలెత్తకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నారని, ఆమెకు ఆహారం మింగడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని వైద్యులు డాక్టర్ బి.శృతి సాగర్ తెలిపారు. కామారెడ్డి ప్రాంతంలోనే ఇటువంటి అధునాతన చికిత్స విధానాలతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించిన యశోద మెడికల్ సెంటర్ నిరంతరం కృషి చేస్తోంది. అరుదైన ఈ వైద్య ప్రక్రియను విజయవంతం చేసిన యశోద ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు.