ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉరవకొండలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో అన్సెంట్ అనంతపురం సహకారంతో సెమినార్ హాల్‌లో ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజారాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, అన్సెంట్ మేనేజర్, అనంతపురం, అన్వర్ బాషా, సూపరింటెం డెంట్, ఎల్.ఎస్. రెడ్డి, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు.

యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, లక్ష్యసాధన , సామాజిక బాధ్యత వంటి అంశాలపై వారు విలువైన సందేశాలను అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఎం. సుధాకర్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సమన్వయంతో నిర్వహించారు. గాయత్రి, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ప్రేరణాత్మక సందేశాలను స్వీకరించారు. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం , సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. “యువత శక్తి – దేశ ప్రగతికి బలం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.