దుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు దర్శించుకున్నారు. విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి బజరంగలాల్ బాగ్డా జీ, కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ జీ, విహెచ్పీ క్షేత్ర కార్యదర్శి రవికుమార్ జీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి సభ్యులు పెనుమతి రాఘవరాజు, అవ్వారు బుల్లబ్బాయి విహెచ్పీ ప్రముఖులకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం వారికి ఆలయ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం అనంతరం విహెచ్పీ ప్రముఖులు మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రి క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
