ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ కొండపల్లి పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి ఆధ్వర్యంలో నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆ భగవంతుని దీవెనలతో రాష్ట్రంలో బీజేపీ మాధవ్ నాయకత్వంలో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు దాము భవాని, సేనాపతి నాగమణి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఈర్ల పరమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగళ్ల రఘునాథరెడ్డి, కూనాల యుగంధర్, రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.