కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1.01 లక్షల విరాళం..
భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన బాలకృష్ణారావు కుటుంబం
(ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ) : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి అన్నదాన విభాగానికి మాచవరం, విజయవాడకు చెందిన బి.హెచ్. బాలకృష్ణారావు, సేతు మాధవ, కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారంగా ఈ మొత్తాన్ని అందజేశారు.
ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్‌కుమార్, అర్చక స్వాముల సమక్షంలో విరాళాన్ని భక్తిపూర్వకంగా సమర్పించారు. దేవస్థానం తరఫున అధికారులు దాత కుటుంబానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు వేద ఆశీర్వచన అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.
