వయోవృద్ధుల సంరక్షణపై దృష్టి సారించాలి
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని రహదారి బంగ్లాలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ మండల స్థాయి అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు పోతు నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షుడు ఎర్రగుంట వెంకటేశం, ఆలేరు యూనిట్ అధ్యక్షుడు చింతకింది మల్లయ్య, జిల్లా కౌన్సిలర్లు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఒగ్గు క్రిస్టఫర్తో పాటు ఆలేరు యూనిట్ కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోతు నరసింహారావు వయోవృద్ధుల సంరక్షణ, పోషణతో పాటు గ్రామ కమిటీల నిర్వహణ బాధ్యతలపై వివరించారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోగా మండల కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి వయోవృద్ధుల సంరక్షణ, వారి సమస్యలపై చర్చించాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పోతు నరసింహారావును నాయకులు, సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.
