రైతుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
ఎమ్మెల్యే కుమార్ రాజా
పామర్రు, ఆంధ్రప్రభ: రైతుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కుమార్ రాజా అధికారులను హెచ్చరించారు. సోమవారం ఎమ్మెల్యే కుమార్ రాజా దృష్టికి ఇన్సూరెన్స్ రైతులకు చేసే విషయంలో అధికారులు సరిగా పనిచేయడం లేదని సమస్యను రైతులతో కలిసి పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి అగ్రికల్చరల్ అధికారులతో, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఎవరు పనిచేసిన ఉపేక్షించేది లేదన్నారు.
రైతులకు ఇన్సూరెన్స్ చేసే బాధ్యత మీపై ఉన్నదని, సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఉన్నత అధికారులతో మాట్లాడి పరిష్కరించుకొని రైతులకు బాధ్యతగా ఇన్సూరెన్స్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నదని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమస్య పరిష్కారమై నాలుగో సచివాలయం నందు పదిమంది రైతులకు ఇన్సూరెన్స్ చేసి వారిని పంపించారు. రైతులు పత్రికాముకంగా ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
