మాదల సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన దేవినేని
నందిగామ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ నాయకుడు, కంచల పీఏసీఎస్ చైర్మన్ మాదల సురేష్ కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. మాదల సురేష్ పెద్దకర్మ సందర్భంగా నందిగామ మండలం కంచల గ్రామంలోని ఆయన నివాసానికి దేవినేని ఉమా వెళ్లారు.
కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ మాదల సురేష్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
