ఉయ్యూరు ప్రధాన కూడలిలో నిరసన..

ప్రజాసంఘాల నాయకుల అరెస్ట్

ఉయ్యూరు టౌన్, ఆంధ్రప్రభ : ఆనాటి తెల్ల దొరల పాలనలో స్వాతంత్ర్యం కోసం గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని అదే స్ఫూర్తితో నేటి పాలకుల పాలనలో క్విట్ ఇండియా ఉద్యమం అవసరమని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు అన్నారు. సోమవారం జైల్ బరో రాస్తారోకో పిలుపు సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఉయ్యురు బీఎస్ఎన్ ఎల్ కార్యాలయము ఎదురుగా రాస్తా రోకో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా హరిబాబు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని కార్మికులందరికీ నెలకు రూ. 31 వేల చొప్పున కనీస వేతనం చెల్లించాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని ఆయన ప్రతిపాదించిన C2 ప్లస్ 50% ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలని ఆయన అన్నారు. రైతులను రక్షించండి కార్మికులను రక్షించండి భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షించండి అనే డిమాండ్లతో కూడిన ని నాదాలు చేశారు.

ఉయ్యూరు ప్రధాన కూడలిలో రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టౌన్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే శివ నాగేంద్రం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శీలం నారాయణరావు కంకిపాడు పార్టీ మండల కార్యదర్శి సీహెచ్ శ్రీహరి పెనమలూరు మండల కార్యదర్శి ఎస్కే కాసిం సీఐటీయూ పెనమలూరు మండల కార్యదర్శి తాడంకి నరేష్, సీఐటీయూ కంకిపాడు సభ్యులు సీహెచ్ రెడ్డయ్య పామర్రు మండల కార్యదర్శి ఓడుగు గంగాధర్ ప్రసాద్, తోట్లవల్లూరు మండల కార్యదర్శి బుల్లియ్య కంభం, కొండల బాబు, ఉయ్యూరు సీఐటీయూ కన్వీనర్ బి. రాజేష్ ఐద్వా బాధ్యులు బి .కీర్తి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.