మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసుల విస్తృత తనిఖీలు

దండేపల్లి ఆంధ్రప్రభ: మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌ నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో పలు కిరాణా దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి.

మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

తనిఖీల్లో నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో పాటు దండేపల్లి పోలీసులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.