ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ
హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా బీజేపీ నాయకుల కార్యక్రమం
మోత్కూర్, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సోమవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షురాలు చాడ మంజుల రెడ్డి తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా తుంగతుర్తి నియోజకవర్గ కో-కన్వీనర్ బయ్యని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ గుప్తా, మాజీ పట్టణ అధ్యక్షుడు పోచం సోమయ్య, ప్రధాన కార్యదర్శులు జినుకల దశరథ ముదిరాజ్, అన్నెపు సత్యనారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ నిలిగొండ మచ్చగిరి, కార్యదర్శి తీగల శ్రీధర్ గౌడ్, యువ మోర్చా ఇన్చార్జి బద్దం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
