కోటమహలక్ష్మమ్మ ఆలయ అభివృద్ధికి లక్ష విరాళం..
మైలవరం, ఆగస్టు10 (ఆంధ్రప్రభ ) : ద్వారకాతిరుమల దేవస్థాన దత్తత దేవాలయమైన మైలవరం శ్రీ కోటమహలక్ష్మమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులు చేయూతను అందించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మైలవరం గ్రామానికి చెందిన ఉయ్యూరు మురళీకృష్ణారావు, రమాదేవి, సాయి శంకర్, పల్లవి కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
సోమవారం ఈ విరాళాన్ని ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్.వి. సుధాకర్‌రావుకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న దాతలకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆలయ అభివృద్ధికి భక్తులు తమవంతు సహకారం అందించాలని కోరారు. దాతల కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
