కదం తొక్కిన స్కీమ్ వర్కర్లు..

విజయనగరం, ఆంధ్రప్రభ: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, రెండో ఏఎన్‌ఎంలు, పారిశుధ్య కార్మికులు సోమవారం కదం తొక్కారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడి, రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు.