రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె మృతి

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం కుమార్తె షేక్‌ అసిఫా (24) మృతి చెందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఏటుకూరు బైపాస్‌ వద్ద ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుమార్తె మృతి వార్త తెలుసుకున్న డీసీపీ షిరీన్‌ బేగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.