బాపట్ల జిల్లాలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. 66 ద్విచక్ర వాహనాలు సీజ్‌

  • రేపల్లె, చీరాల సబ్‌ డివిజన్లలో ఏకకాలంలో సోదాలు
  • 20 మద్యం బాటిళ్లు, 6 ఆటోలు స్వాధీనం.. 180 మంది సిబ్బందితో తనిఖీలు

బాపట్ల, ఆంధ్రప్రభ: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో పోలీసులు విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. రేపల్లె, చీరాల సబ్‌ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో 180 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో 66 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 20 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.